ప్రభాస్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్ రెడీచేసిన 'రాధే శ్యామ్' టీమ్

ప్రభాస్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్ రెడీచేసిన 'రాధే శ్యామ్' టీమ్

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌తో పాటు టైటిల్‌‌తో కూడిన పోస్టర్‌ను ఇటీవలే రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . ఈపోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టిన రోజు వేడుకను వైభవంగా జరుపుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న నటించబోతున్న మూడు సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ లేదా సర్ ప్రైజింగ్ గిఫ్ట్ లను ప్రేక్షకులకు ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే డార్లింగ్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ను రెడీ చేస్తున్నారు రాధేశ్యామ్ టీమ్ . అక్టోబర్ 23న 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో ఈ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఈ సర్ప్రైస్ సంగీతం పరంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఇప్పటికే రిలీజైన చిత్ర ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది.