పోస్ట్ ప్రొడక్షన్ లో ఆర్. నారాయణ మూర్తి 'రైతన్న'

పోస్ట్ ప్రొడక్షన్ లో ఆర్. నారాయణ మూర్తి 'రైతన్న'

పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రైతన్న'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా తొలి కాపీ మరో వారంలో రెడీ కానుంది. మార్చి లో ఈ మూవీని విడుదల చేస్తామని దర్శక నిర్మాత, చిత్ర కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి చెబుతున్నారు. సినిమా కథాంశం గురించి చెబుతూ, 'ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను తీసుకొచ్చింది. అవి రైతులకు వరాలు కావు, మరణ శాసనాలు. అందుకే పంజాబ్, హర్యానా, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు వాటిని రద్దు చేయమని ఉద్యమం చేస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయమని కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతులంటే తనకు గౌరవం ఉందని చెబుతుంటారు. అదే నిజమైతే ఓ కళాకారుడిగా ఆయన్ని నేను ఈ చట్టాలను రద్దు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే విషయాన్ని నా 'రైతన్న' చిత్రంలోనూ చూపించాను'' అని అన్నారు.