ప్రపంచ కప్ లోకి మిస్టర్ 360... క్లారిటీ ఇచ్చిన కెప్టెన్..

ప్రపంచ కప్ లోకి మిస్టర్ 360... క్లారిటీ ఇచ్చిన కెప్టెన్..

ఏబీ డివిలియర్స్.. ఈ హార్డ్‌ హిట్టింగ్‌ బాట్స్మెన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉండగానే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ డాషింగ్‌ ప్లేయర్‌.. వరల్డ్‌ వైడ్‌ టీ20 లీగ్స్‌లో ఆడుతూ భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. ఇప్పటికీ ఫుల్‌ ఫిట్‌నెస్‌తో ఉన్న డివిలియర్స్‌ మళ్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు అని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. మిస్టర్ 360 కూడా తాను జట్టులోకి రావాలనుకుంటున్నట్లు గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ కు ముందు స్పష్టం చేసాడు. కానీ అప్పటి పరిస్థితుల కారణంగా అతను ప్రపంచ కప్ జట్టులోకి రాలేక పోయాడు. అయితే ఈ విషయం పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో దక్షిణాఫ్రికా వైట్-బాల్ కెప్టెన్ క్వింటన్ డికాక్ స్పందిస్తూ... వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జట్టులోకి మేము అతడిని తీసుకుంటాము. అయితే ఏబీ దగ్గర అందుకు తగిన ఫిట్నెస్ ఉంటె చాలు. డివిలియర్స్ లాంటి ఆటగాడిని ఏ జట్టు అయిన సరే వదులుకోదు అని వివరణ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ ను వచ్చే ఏడాది అక్టోబర్ కు ఐసీసీ వాయిదా వేసిన విషయం అందరికి తెలిసిందే.