క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా క్వింటన్ డికాక్...

క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా క్వింటన్ డికాక్...

క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా క్వింటన్ డికాక్ ఎంఎంపికయ్యాడు. క్రికెట్ సౌత్ ఆఫ్రికా వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో వైట్-బాల్ కెప్టెన్ క్వింటన్ డికాక్ పురుషుల ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ గా ఎంపికయ్యాడు అలాగే ఈ ఏడాది టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ కూడా డికాక్ దక్కించుకోగా, యువ ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మరియు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక పేసర్ 'లుంగీ ఎంగిడీ వన్డే మరియు టీ 20 ప్లేయర్‌గా ఎంపిక కాగా , డేవిడ్ మిల్లెర్ ఫాన్స్ ఫెవరెట్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. 2017 లోఈ అవార్డు  అందుకున్న డికాక్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. 2004 లో ప్రారంభించిన  ఈ అవార్డు డికాక్ తో పాటుగా రెండు సార్లు అందుకున్నవారు, జాక్వెస్ కాలిస్ (2004 మరియు 2011), మఖాయ న్టిని (2005 మరియు 2006),  హాషిం  ఆమ్లా (2010 మరియు 2013), ఎబి డివిలియర్స్ (2014 మరియు 2015) మరియు కగిసో రబాడా (2016 మరియు 2018).