నాపై వస్తున్న వార్తలు అన్ని తప్పు : పీవీ సింధు

నాపై వస్తున్న వార్తలు అన్ని తప్పు : పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు జాతీయ శిక్షణ శిబిరం వదిలేసి లండన్ వెళ్లిందని అలాగే తన తలిదండ్రులతో మరియు కోచ్ గోపీచంద్ తో ఏవో సమస్యలు వచ్చాయి అని ఈ మధ్య వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవి ఏవి నిజం కాదు అని సింధు స్పష్టం చేసింది. తన పై అలా అసత్య వార్తలను ప్రచారం చేసిన రిపోర్టర్ పై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యింది. నేను శిక్షణ శిబిరం వదిలి ఎక్కడికి వెళ్లలేదని అలాగే తన తలిదండ్రులతో మరియు కోచ్ గోపీచంద్ తో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని స్పష్టం చేసింది.