తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన పివి సింధు..

తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన పివి సింధు..

కరోనా తర్వాత భారత స్టార్ షెట్లర్ పివి సింధు థాయ్‌లాండ్ ఓపెన్ 2021 లో పాల్గొంది. అయితే ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై వెనుదిరిగింది సింధు.  తొలి రౌండ్‌లో డెన్మార్క్ ‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌ చేతిలో 21-16, 24-26, 13-21 తేడాతో  ఓడిపోయింది. ప్రత్యర్థి పై మొదటి రౌండ్లో ఆధిపత్యం చూపించిన సింధు రెండో రౌండ్ ను కూడా అలానే ప్రారంభించింది. కానీ ఆ తర్వాత బ్లిచ్‌ఫెల్డ్‌ పుంజుకొని రెండు, మూడు రౌండ్ లను తన సొంతం చేసుకొని విజయం సాధించింది. ఇక సింధు తో పాటుగా మరో స్టార్ ఆటగాడు సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్ లో థాయ్‌లాండ్  ‌కు చెందిన కాంటాఫోన్ వాంగ్‌చరోయెన్ చేతిలో వరుసగా 16-21, 10-21 రెండు రౌండ్లు కోల్పోయి మ్యాచ్ ఓడిపోయాడు.

ఇక మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఇండోనేషియాకు చెందిన హైఫిజ్ ఫజల్, గ్లోరియా ఇమాన్యుల్లె విద్జాజాను 21-11, 27-29, 21-16 తో భారత్‌ కు చెందిన సాత్విక్ ‌సైరాజ్ రాంకిరెడ్డి, అశ్విని పొన్నప్ప జోడి ఓడించి రెండో రౌండ్ లోకి అడుగు పెట్టారు.