పంజాబ్ కు షాక్... ఆసుపత్రికి జట్టు కెప్టెన్

పంజాబ్ కు షాక్... ఆసుపత్రికి జట్టు కెప్టెన్

ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన విషయాన్ని జట్టు యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అందులో 'గత రాత్రి కేఎల్ రాహుల్ కడుపునొప్పితో బాధపడ్డాడు. వెంటనే టీమ్ ఫిజియో ప్రాథమిక చికిత్స అందించగా అతను కోలుకోలేదు. దాంతో అతన్ని అత్యవసర రూమ్‌కు తరలించి పలు పరీక్షలు చేశారు. రాహుల్ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సర్జరీ చేయాల్సిన నేపథ్యంలో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.'అని పేర్కొంది. అయితే ఈరోజు పంజాబ్ జట్టుకు ఢిల్లీ తో మ్యాచ్ ఉంది. ఇక ఈ మ్యాచ్ కు దూరమవుతున్న రాహుల్ పూర్తి సీజన్ కు కూడా దూరమవుతాడా.. లేదా మళ్ళీ తిరిగి వస్తాడా అనేది చూడాలి.