ముంబయి ఓటమి.. ప్రీతీజింతా ఆనందం

ముంబయి ఓటమి.. ప్రీతీజింతా ఆనందం

ఐపీఎల్-11లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన నాలుగు జట్లేవో తెలిసిపోయింది. హైదరాబాద్, చెన్నై, కలకత్తా జట్లు ముందుగానే తమ బెర్తును ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక బెర్తు కోసం రాజస్థాన్, ముంబయి, పంజాబ్ జట్లు పోటీ పడ్డాయి. అయితే పంజాబ్ జట్టు ప్లేఆఫ్ చేరాలంటే చెన్నైపై 53 పరుగులకు పైగా తేడాతో గెలుపొందాలి.. మరోవైపు ఢిల్లీ చేతిలో ముంబయి ఓడిపోవాలి. ఈ రెండు జరిగితేనే పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది.

ఆదివారం రాత్రి 8 గంటలకు చెన్నై, పంజాబ్ మ్యాచ్ ఉంది. సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు ఢిల్లీ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసి లీగ్ నుంచి నిష్క్రమించింది. చెన్నై, పంజాబ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు కావున మ్యాచ్ వీక్షించేందుకు పంజాబ్ సహయాజమాని ప్రీతీజింతా  స్టేడియంకు వచ్చింది. ఇదే సమయంలో ముంబయి ఓడిపోయిన విషయాన్ని తెలుసుకున్న ప్రీతీ.. మరో సహయాజమానితో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. పక్కనే ఉన్న అతనితో మాట్లాడుతూ.. 'నాకు చాలా సంతోషంగా ఉంది. ముంబయి ఫైనల్స్‌కు వెళ్లట్లేదు' అని అంది. ప్రీతి సంభాషిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనంతరం పంజాబ్‌పై చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.