బంపరాఫర్..! ఇక్కడ భోజనం చేస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీదే..!

బంపరాఫర్..! ఇక్కడ భోజనం చేస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీదే..!

వ్యాపారం చేయడం కాదు.. అందులో ఎలా నెగ్గుకు రావాలో కూడా తెలిసి ఉండాలి.. మార్కెట్‌ చేసుకోవడం తెలిస్తే చాలు.. కస్టమర్లు వారే వచ్చేస్తారన్నమాట... తాజాగా మహారాష్ట్రలోని ఓ హోటల్‌ యజమానికి భలే ఐడియా తట్టింది... వెంటనే బంపరాఫర్‌ ప్రకటించాడు... కేవలం 60 నిముషాల్లో వారు పెట్టిన భోజనం పూర్తి చేస్తే చాలు.. కలలుగనే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీ సొంతం అవుతుందన్నమాట.. భోజనం నేనైతే 15 నిమిషాల్లోనే.. మహా అయితే.. అరగంటలోనే ఫినిష్‌ చేస్తానని గొప్పలకు పోకండి.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌.. మరో విషయం ఏంటంటే.. వారు వడ్డించే భోజనం ఖరీదు అక్షరాలా రూ.2,500 మాత్రమే అంటే నమ్మండి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పుణె శివారులోని వాడ్గావ్ మావల్ ప్రాంతంలో ఓ హోటల్‌ ఉంది.. కరోనా దెబ్బ హోటల్‌ రంగాన్ని దెబ్బ కొట్టడంతో.. ఆ తర్వాత బిజినెస్‌ పెంచుకోవడంపై ఫోకస్‌ పెట్టాడు యజమాని.. అందులో భాగంగా ‘బుల్లెట్ బైక్’ కంటెస్ట్ ప్రకటించింది శివరాజ్ హోటల్.. దానికి చివర్లు షరతులు వర్తిస్తాయనే బోర్డు కూడా తగిలేశారనుకోండి..! అంటే.. ఆ హోటల్‌ నిర్వహకులు పెట్టే నన్‌వెజ్ భోజనాన్ని కేవలం 60 నిమిషాల్లోనే ఫినిష్‌ చేయాలి.. అందులో 4 కిలోల మటన్, చేపలతో తయారు చేసిన 12 రకాల వంటకాలు వడ్డిస్తారు.. వీటితో చేపల వేపుడు, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ.. అబ్బో ఇలా రుచికరమైన భోజనమే వడ్డిస్తారు.. దీనికి మీరు సమర్పించుకోవాల్సింది రూ.2,500గా నిర్ణయించారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి 60 నిమిషాల్లో భోజనాన్ని పూర్తి చేస్తే.. రూ.1.65 లక్షలు విలువ చేసే బుల్లెట్‌ మీ సొంతం అవుతుంది. ఈ ప్రకటన కాస్తా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. ఈ బంపరాఫర్‌కు భారీ స్పందనే వచ్చిందంట.. చాలా మంది ఈ ఛాలెంజ్‌లో విఫలం అయితే.. సోలాపూర్‌కు చెందిన సోమ్‌నాథ్ పవర్ అనే వ్యక్తి.. ఇన్‌టైంలో ఫినిష్‌ చేసి.. బుల్లెట్‌ గెల్చుకోవడం విశేషం. ఒక్క బుల్లెట్‌ సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు శివరాజ్‌ హోటల్‌ పేరు సోషల్ మీడియాలో వైరల్‌ అయిపోయింది.. 12 రకాల వంటకాలు ఉన్నా.. ఒక్క భోజనానికి వారు నిర్ణయించిన ప్రైస్‌ కూడా భారీగానే ఉంది మరి.