నేటి నుంచి పబ్జీ పూర్తిగా బంధ్... 

నేటి నుంచి పబ్జీ పూర్తిగా బంధ్... 

కేంద్రప్రభుత్వం చైనాకు చెందిన 116 యాప్ పై నిషేధం విధించింది.  ఇందులో పబ్జీ యాప్ కూడా ఉన్నది.  పబ్జీ, పబ్జీ లైట్ యాప్ లపై నిషేధం విధించింది.  నిషేధం విధించడంతో అప్పటి నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో కొత్త డౌన్ లోడ్స్ ఆగిపోయాయి. అప్పటికే డౌన్లోడ్స్ చేసుకున్న వ్యక్తులకు మాత్రం పబ్జీ గేమ్ ఆడే అవకాశం ఉన్నది. అయితే, అక్టోబర్ 30 వ తేదీ నుంచి పబ్జి గేమ్ కు సంబంధించిన సర్వర్లను నిలిపివేసింది.  సర్వర్లు నిలిపివేయడంతో ఇండియాలో పబ్జి గేమ్ ను పూర్తిగా ఆగిపోయింది.  ఇక నుంచి ఇండియాలో పబ్జి గేమ్ ఆడేందుకు వీలు ఉండదు. ఇండియాలో పబ్జీ సర్వర్లను నిలిపివేసినట్టు పబ్జీ మొబైల్ పేస్ బుక్ ద్వారా తెలియజేసింది.  వినియోగదార్ల డేటాను కాపాడటమే తమ లక్ష్యమని, సమాచార భద్రతా చట్టాలకు, నిబంధనలకు లోబడి పనిచేస్తామని పబ్జీ తెలిపింది.