బర్త్ డే స్పెషల్ ...  పవన్ 29  అనౌన్స్ మెంట్ ..?

బర్త్ డే స్పెషల్ ...  పవన్ 29  అనౌన్స్ మెంట్ ..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్నాడు. కరోనా తగ్గుముఖం పడితే  డిసెంబర్‌లో కానీ ఈ సినిమా మిగిలిన పార్ట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆ సినిమా తర్వాత క్రిష్‌తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయనున్నాడు. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ టైటిల్‌ అనుకున్నారు. ఈ సినిమాకు మాస్ అప్పీల్ లేదనే ఉద్దేశ్యంతో ’గజ దొంగ’తో పాటు ‘బందిపోటు’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ఉండనుంది. తాజా సమాచారం ప్రకారం PSPK29 ప్రాజెక్ట్ కి కూడా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.  కాగా పవన్ కళ్యాణ్ తన కెరీర్లో 29వ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.