పీఎస్‌పీకే27కు మరో దర్శకుడు..?

పీఎస్‌పీకే27కు మరో దర్శకుడు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దూసుకెళ్తున్నారు. దాదాపు మూడు సంవత్సారాల విరామం తరువాత పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమాతో సినిమాల్లోకి తిరిగి వచ్చారు. వకీల్‌సాబ్ సినిమాను పూర్తి చేసుకున్న పవన్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించనున్నారంట. పవన్ తన సినీ కెరీర్‌లో చేస్తున్న మొదటి పీరియాడికల్ కథ ఇది. ఈ సినిమాకు ఇంకా పేరు ఫిక్స్ కాలేదు. అయితే ఈ సినిమా ఔరంగజేబు కాలంనాటి కథాంశంతో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సినీ సర్కిల్స్‌తో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కుదిరినంత త్వరగా పూర్తి చేసి ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టాలి. అందులో భాగంగా మేకర్స్ సినిమాను రెండు భాగాలుగా విభజించారంట. అందులో మొదటి భాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తే, రెండో భాగాన్ని హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు, పరిచయం సినిమాలను తెరకెక్కించిన లక్ష్మీకాంత్ డైరెక్ట్ చేయనున్నారంట. పెద్ద సినిమాలకు ఇలా సాధారణంగా జరుగుతంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు అండగా ఉండే బందిపోటు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా రేంజ్‌తో నిర్మాణ ఏఎం మణి రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.