ఉత్పత్తి సరే...కొనుగోలు సంగతి...మరొ సంక్షోభంలోకి ఆర్థిక వ్యవస్థ

ఉత్పత్తి సరే...కొనుగోలు సంగతి...మరొ సంక్షోభంలోకి ఆర్థిక వ్యవస్థ

పేదలకు మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి ఇచ్చింది...కేంద్ర ప్రకటించిన ఉద్దీనలో ఎంఎస్ఎంఈలకు ఎటువంటి ఉపశమనం కలగలేదు...కదా,కంపెనీలకు మరింత భారంగా మారనుంది...నిర్దిష్ట ప్రణాళిక, సరైన వ్యూహం, సన్నద్దత లేకుండా ఏ కార్యక్రమం చేపట్టినా విజయం దిశగా పయనిస్తుందని అనుకోవడం ఒట్టి భ్రమ...ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలోనూ కేంద్రప్రభుత్వం అనుసరించిన విధానం అలానే ఉన్నది....

కరోనా లాక్ డౌన్‌తో మార్చిలో రూ. లక్షా 70వేల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించినా అవి ఏ మూలకూ సరిపోలేదు... రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని, అసంఘటిత కార్మికులకు మూడునెలల పాటు వేతనాలివ్వాలని చెప్పిన అధికారిక ఉత్తర్వులు లేవు, రాష్ట్రాలకు ఆర్థిక భరోసా కల్పించాలని, రుణాలు తెచ్చుకోవడానికి ఉన్న పరిమితులు ఎత్తివేయాలని సీఎంలు కోరినా ఇప్పటివరకు ఏ ఒక్కదానికీ ప్రధాని స్పష్టత ఇవ్వలేదు...

నిన్న ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన పథకంలో దేశానికి వెన్నెముక అయినా వ్యవసాయరంగానికి ప్రధాన్యత లేకుండా ప్రకటించారు..ఎంఎస్ఎంఈ కంపెనీలకు దాదాపుగా 6 లక్షలకోట్లు ప్రకటించారు..ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహాం ఇవ్వడంతో దేశం అభివృద్ధిలో  ముందుకు పోతుందని,అంతర్జాతీయ కంపెనీలతో పోటీ పడుతుంది కేంద్రం ప్రకటించింది..మన దేశం-మన వస్తులు అనే కోత్త నినాదం తెరపైకి చచ్చింది...కాని ఎంఎస్ఎంఈలకు ముడిసరుకలను అందించే వ్యవసాయరంగంపై కేంద్రం చిన్న చూపు చూస్తుంది...వ్యవపాయ ఉత్పత్తులు, మార్కెట్ రంగాలను విస్తరించడానికి ఉద్దీపన పథకంలో ఎటువంటి భరసో ఇవ్వలేదు...

ఇప్పుడు వ్యవసాయ రంగంను అదుకోకపోతే వచ్చే మూడు సంవత్సరాలు దేశంలో వ్యవసాయ రంగంపై ఉంటుందంటున్నారు విశ్లేషకులు...ఒక్క వ్యవసాయంపైనే కాకుండా దానిపై ఆధారపడి నడుస్తున్నఅనేక సంస్థలు,లక్షల కోద్దీ ఎంఎస్ఎంఈలు కూడా ప్రభావితం అవుతాయంటున్నారు...దేశంలో దాదాపు 60 శాతం జనాభాపై దీని ప్రభావం పడుతుంది...దేశంలో వ్యవసాయ రంగం కుదేలైతే నిరుద్యో రేటు కూడా పెరుగుతుందంటున్నారు...

మన దేశం శాస్త్ర శాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకు పోతున్న, ఇప్పటికి  దాదాపుగా  50 నుంచి 60శాతం వరకు ప్రజలు వ్యవసాయం,దాని అనుభంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నారు... పొలాల నుంచి పంటలు  రైతుల ఇండ్లకు వచ్చే సమయంలో వైరస్‌ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు... ఫలితంగా రైతాంగం, వారి మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రభావితులయ్యారు... పంటలను కోసే దిక్కు లేకుండా పోయింది కొన్ని చోట్ల, యంత్రాలు ఒక ప్రాంతం నుంచి మరోచోటికి తరలే అవకాశాలు లేక కూలీల కొరత ఏర్పడింది... కొన్ని చోట్ల చెరకు, మిర్చి కోతలకు వచ్చిన వలస లేదా అతిధి కూలీలు సీజను ముగిసి తమ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎక్కడికక్కడ చిక్కుకు పోయారు... అకాల వర్షాల కారణంగా కళ్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి వంటికి తడిచిపోయాయి. పండ్లు కోసేవారు, కోసినా మార్కెట్లకు తరలించే సదుపాయాల్లేక చెట్ల మీదనే పండిపోతున్నా రైతాంగం గుడ్లప్పగించి చూస్తూ వదలివేయటం తప్ప మరొకటి చేయలేని స్ధితి....

ఇప్పుడు మన దేశంలో విదేశీ ద్వేషం రోజురోజూకు పెరుగుతుంది...మన దేశంపై మనకు గౌరవం,అభిమానం ఉండటం తప్పులేదు అలా ఉండాలి కూడా...ప్రధాని ప్రకటించిన మన దేశం-మన వస్తులు అనే నినాదం బాగానే ఉంది.. కాని మేకిన్‌ ఇండియా-మేడిన్‌ ఇండియా స్లోగన్‌ స్లోగన్‌ గానే మారిపోయిందా?... కరోనాతో మార్కెట్లపై ప్రభావం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం చాలా ముఖ్యం అందుకు ఇప్పుడు మన దేశం-మన వస్తులు విధానం అమలు చేయాలి...కాని విదేశీ మార్కెట్లకు దీటుగా మన మార్కెట్ వ్యవస్థను తయారు చేశారా? దానికి ఎటువంటి ప్రణాళికలు ఉంది?..మన దేశంలో 130కోట్ల ప్రజలకు కావాల్సిన వస్తువులు తయారు చేసే వ్యవస్థను పాలకులు అభివృద్ది చేశారా?..ఇప్పుడు ఎంఎస్ఎంఈలకు ఉద్దీపన పథకం ప్రకటించాం అంటే అది మాత్రమే సరిపోతుందా?..

దేశంలో ఉన్నా ఎంఎస్ఎంఈలు చాలా వరకు విదేశీ ముడిసరుకుపై ఆధాపరడి నడుస్తున్నాయి...కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ రవాణ సర్వీసులు నిలిచిపోయాయి...ప్రాకేజీ ప్రకటించాం కదా ఉత్పత్తి మొదలు పెట్టమట్టే సరిపోతుందా?..ముడి సరుకులు లేకుండా ఉత్పత్తి ఎలా సాధ్యం అవుతుంది?..ముడి సమురు దిగుమతులు,ఎగుమతులపై కేంద్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోందో స్పష్టత ఇవ్వలేదు...ఇప్పటికే మూడు నెలల నుంచి ఉత్పత్తి లేకుండా, బ్యాంక్‌ రుణాలకు వడ్డీలు పెరిగిపోయాయని,ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అప్పులు, కార్మికుల జీతాలకే సరిపోవని ఎంఎస్ఎంఈల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

ఉత్పత్తి ప్రారంభిస్తే వాటిని కొనుగొలు చేయకపోతే అది మరో సంక్షోభానిక దారిస్తుంటున్నారు..ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది బ్యాంక్‌ అప్పు మాత్రమేనని దాని వల్ల ఎంఎస్ఎంఈలకు వచ్చే అదనపు లాభం ఎం లేదంటున్నారు,పైగా అప్పుకు అప్పుగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు...

దేశంలో పారిశ్రామికంగా వృద్ధిలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో కార్మికులకు లాక్‌డౌన్‌ కాలానికి వేతనాలు అందలేదు. దేశవ్యాప్త మూసివేత సందర్భంగా అసంఘటితరంగాల్లో పనిచేస్తున్న కార్మికుల్లో చాలామందికి జీతాలు రాలేదని ఒక నివేదికలో వెల్లడైంది...గుజరాత్‌లో 92 శాతం మందికి, మహారాష్ట్రలో 59 శాతం మంది కార్మికులకు వారి యజమానులు వేతనాలు చెల్లించలేదని పలు నివేదికలు తెలిపాయి...లాక్‌డౌన్‌ కాలంలో యజమానులు తమను ఆదుకోలేదని కార్మికులు వాపోతున్నారు. ఈ సమయంలో తమ యజమానుల వైఖరి పూర్తిగా మారిందని గుజరాత్‌లో 61 శాతం మంది కార్మికులు చెప్పగా.. మహారాష్ట్రలో 33 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు...

దేశంలో ప్రజల కోనుగొలు శక్తి పెంచితే రాష్ట్రాలు ఆదాయం వస్తుంది.... తాము ఇవ్వదలచుకున్న వారికి ఆ సొమ్మును పంపిణీ చేస్తాయి, జనం సరకులు కొనుగోలు చేస్తే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. సరకులు అమ్ముడు పోతే తయారీ డిమాండ్‌ పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది, తద్వారా కార్మికుల కొనుగోలు శక్తి పెరుగుతుంది.అది మరింత డిమాండ్‌ను పెంచుతుంది...

కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ సంస్ధలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చాయి. ఆ సొమ్మంతా తిరిగి పెట్టుబడులుగా మార్కెట్లోకి వస్తాయో,లేదా మూడునెలల వడ్డీలకు పోతాయా స్పష్టత లేదు... లాక్‌డౌన్‌ వల్ల కార్మికలకు ఉపాధి మందగించింది, జనానికి తగిన ఆదాయం లేకపోవటం, వస్తుకొనుగోలుకు చేసే వ్యయానికి తగిన డబ్బు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతాలలో వస్తు వినియోగం తగ్గింది... మరోమాటలో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇది పరిశ్రమల మీద పడుతుంది ఫలితంగా నిరుద్యోగం రోజు రోజుకు పెరిగుంది, అనేక సంస్ధల మూతకు దారి తీసింది. ఈ పరిస్ధితి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీస్తుంది... అది మరింత నిరుద్యోగానికి కారణమైయ్యే అవకాశాలు ఉన్నాయి... స్వయం సహాయ సంస్ధల ఏర్పాటు లక్ష్యం స్వయం ఉపాధిని కల్పించటం, కానీ జరిగిందేమిటి ? వాటికి ఇచ్చే రుణాలను వేరే అవసరాలకు వినియోగించినందున అసలు లక్ష్యం వెనుకబడిపోయింది...ఈ రోజు ఎంత వస్తే అంత ఎలా ఖర్చు చేయాలి అనే వినిమయ సంస్కృతి మన దేశంలో పెరిగిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే అప్పుచేసి పప్పుకూడు...