ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

సంచలనంగా మారిన  నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఏ3 నేరస్తుడిగా ఉన్న ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అశోక్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ2 గా సాయిరెడ్డి, ఏ3గా నిర్మాత అశోక్ రెడ్డిని రిపోర్ట్ లో చేర్చారు పోలీసులు. ముగ్గురు వ్యక్తుల వేధింపులతో ఒత్తిడికి గురైన నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే దేవరాజ్ రెడ్డి , సాయిరెడ్డి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా గతకొద్దిరోజులుగా పరారీలో ఉన్న అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు . అశోక్ రెడ్డి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో పోలీసులు 17 మంది సాక్షులను విచారించారు. పోలీసుల అదుపులో ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణలను పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే, సోమవారం రోజున విచారణకు వస్తానని చెప్పిన నిర్మాత అశోక్ రెడ్డిమాత్రం పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. పైగా సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు.