ప్రియాంక-నిక్ మెహందీ ఫోటోలు

ప్రియాంక-నిక్ మెహందీ ఫోటోలు

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు. ఈ వివాహం జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఇద్దరూ రేపు హిందూ సంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకోనున్నారు. నిక్ తో పెళ్లి జరిగిన తర్వాత ప్రియాంక తన మెహందీ వేడుక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టింది. 

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో మెహందీ వేడుక ఫోటోలను షేర్ చేశారు. ఫోటోల్లో ఇద్దరూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ప్రియాంక మల్టీకలర్ రాజస్థానీ డ్రెస్ తో పాటు రాజస్థానీ వెండి ఆభరణాలు ధరించి మెరిసిపోయింది. వైట్ కాలర్ కుర్తా పైజమా వేసుకున్న నిక్ కూడా సూపర్ కూల్ గా కనిపించాడు. ప్రియాంక చెల్లెలు పరిణితి చోప్రా పసుపు రంగు సూట్ లో, సోఫీ టర్నర్ ఆకుపచ్చ రంగు లహంగా, చున్నీలు ధరించారు. 

ప్రియాంక చోప్రా డ్రెస్ ని సుప్రసిద్ధ సెలబ్రిటీ డిజైనర్లు అబూ జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. జువెలరీ కలెక్షన్ డిజైనింగ్ బాధ్యతను కూడా వీళ్లకే అప్పజెప్పిందట పిగ్గీ చాప్స్.