తలైవి సినిమాలో శశికళ పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసా? 

తలైవి సినిమాలో శశికళ పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసా? 

తమిళనాడు రాజకీయాలను శాసించిన అమ్మ జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో కంగనా హీరోయిన్.  జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది.  ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.  ఇందులో ఎంజీఆర్ గా అరవింద స్వామి నటిస్తున్నారు.  

ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.  అమ్మ జయలలిత నిచ్చెలి శశికళ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయం నిన్నటి వరకు సస్పెన్స్ గా ఉన్నది.  అనేక పేర్లు తెరమీదకు వచ్చినా ఎవర్ని డిసైడ్ చేయలేదు.  అయితే, ఇప్పుడు నిచ్చెలి శశికళ పాత్రలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి నటిస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉన్నది.