ఆ క్రికెటర్ పై ప్రియమణి చెయ్యి చేసుకోలేదట.. కానీ..!

ఆ క్రికెటర్ పై ప్రియమణి చెయ్యి చేసుకోలేదట.. కానీ..!

ప్రియమణి గురించి అందరికి తెలుసు. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న తనకి ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో షోలు చేస్తుంది. అయితే అప్పట్లో ఈమెకు ఓ క్రికెటర్ కు మధ్య వివాదం వార్తల్లో నిలిచింది. అప్పటి నుంచి అసల ఏం జరిగింది అనే ఆసక్తి  అందరిలోనూ ఉంది. సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సందర్భం గా ఓ క్రికెటర్ ప్రియమణిని తో అసభ్యకరంగా ప్రవర్తించడం తో అతడి చెంప చెళ్ళుమనిపించిందని అని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు చోటుచేసుకున్న ఆ వివాదంపై తాజాగా ప్రియమణి స్పందించింది. క్రికెటర్ తన మొబైల్ ఫోన్ దొంగిలించి ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టాడట... ఇంకా తనతో ఫ్రాంక్ మాట్లాడుతూ ఇబ్బంది పెట్టాడని ప్రియమణి తెలిపింది. కానీ తరువాత అతనే వచ్చి తన మొబైల్ ఇచ్చి కొంచెం ఇబ్బంది పెట్టాడని అందువల్ల అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేశానని వివరణ ఇచ్చింది. అయితే ఈ క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు ప్రియమణి. ఇక ప్రస్తుతం ప్రియమణి తెలుగులో వెంకటేష్ సరసన నారప్ప సినిమాలలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.