భర్తనే తన మేనేజర్ గా పెట్టుకున్న స్టార్ హీరోయిన్... 

భర్తనే తన మేనేజర్ గా పెట్టుకున్న స్టార్ హీరోయిన్... 

ప్రియమణి గురించి అందరికి తెలుసు. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న తనకి ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో షోలు చేస్తుంది. కానీ ప్రస్తుతం తెలుగులో అసురన్ రీమేక్ గా వెంకటేష్ చేస్తున్న నారప్ప సినిమాలో ఆయనకు భార్య పాత్రలో నటిస్తుంది. అలాగే రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న విరాట పర్వం సినిమాలో కామ్రేడ్ భారతక్క గా చేస్తుంది. అయితే సినిమాలో నటించే పాపులర్ యాక్టర్స్ అందరి దగ్గర ఓ మేనేజర్ ఉంటాడు. అతనే ఆ యాక్టర్ కు సంబంధించిన డేట్స్, రెమ్యూనరేషన్స్ వంటి పనులను చూసుకుంటారు. కానీ ఇటు సినిమాలు అటు షోలు చేస్తున్న ప్రియమణికి మాత్రం తన భర్తే మేనేజర్ అంట! ఆయనే ప్రియమణి సినిమాలు, షోలకు సంబంధించిన వివరాలు చూస్తున్నారట!  అయితే  ప్రియమణి తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అజయ్ దేవ్ గణ్ హీరోగా వస్తున్న మైదాన్ సినిమాలో నటిస్తున్నారు.