స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన ప్రియమణి...

స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన ప్రియమణి...

ప్రముఖ డాన్స్  రియాలిటీ షో ఢీ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు. తాజాగా నవంబర్ 4న ప్రసారమయ్యే క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఓ కంటెస్టెంట్… ‘వకీల్ సాబ్’ లోని ‘మగువా మగువా..’ పాటకు ప్రదర్శన ఇచ్చాడు. దీనిని చూసిన ప్రియమణి, రష్మి… కన్నీళ్ళు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రియమణి మాట్లాడుతూ.. “ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూ చూసాను. అందులో ఒకతను మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లు ఎందుకు పనిచెయ్యాలి? అనే ప్రశ్న వేసాడు. అమ్మాయిలు తమ శరీరం కనిపించేలా పొట్టి పొట్టి డ్రెస్సులు ఎందుకు వేసుకోవాలి. వాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చుగా’ అని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన జెంట్స్ అంతా ఇలాగే మాట్లాడారు” అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రోమో చూసిన ఢీ అభిమానులు ఆ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.