'కామ్రేడ్ భారతక్క'గా ప్రియమణి.. "విరాటపర్వం"లుక్‌ ఔట్

'కామ్రేడ్ భారతక్క'గా ప్రియమణి.. "విరాటపర్వం"లుక్‌ ఔట్

కామ్రేడ్‌ భారతక్కగా నటిస్తున్నారు ప్రియమని... రానా హీరోగా, సాయి ప‌ల్లవి హీరోయిన్‌గా వేణు ఉడుగుల తెర‌కెక్కించిన చిత్రం "విరాట ప‌ర్వం".. ఈ సినిమాను డి.సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తుండగా.. ఓ సామాజిక సమస్యను చర్చిస్తూ ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.. ఇక, ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలను హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ రిచర్‌ ఆధ్వర్యంలో తెరకెక్కించనున్నారు.. అయితే, ఈ సనిమాలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు ప్రియమని.. ఇవాళ ఆమె బర్త్‌డే సందర్భంగా.. ఆమె పోషిస్తున్న కామ్రేడ్ భారతక్క పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. "ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట ప‌ర్వంలో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం" అంటూ ప్రియ‌మ‌ణి పోస్టర్ విడుద‌ల చేశారు మేకర్స్... ఇక, ప్రియ‌మ‌ణి లుక్ ఆక‌ట్టుకుంటుంది. ఆమె పాత్ర భారతక్క పేరుకు తగ్గట్టుగానే నక్సలైట్‌ డ్రెస్‌లో... బుజానికి తుపాకీ ధరించి ఉన్నారు.