కిష్కిందలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహం... అయోధ్యతో సమానంగానే...!!

కిష్కిందలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహం... అయోధ్యతో సమానంగానే...!!

అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామాలయానికి సంబంధించిన భూమి పూజను పూర్తి చేశారు.  ఆలయ నిర్మాణం పనులు మొదలయ్యాయి.  అయోధ్యలో రాముని ఆలయంతో పాటుగా అతిపెద్ద రాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.  ఈ విగ్రహం 221 మీటర్ల ఎత్తు ఉండబోతున్నది.  బహుశా ప్రపంచంలో అత్యంత ఎత్తిన రాముడి విగ్రహం అదే అవుతుంది.  అయోధ్యలో రాములవారి గుడి, శ్రీరాముని విగ్రహం నిర్మిస్తున్న నేపథ్యంలో, శ్రీరాముడికి నమ్మిన బంటుగా ఉన్న హనుమంతుడికి తగిన గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో, హనుమంతుడు పుట్టిన ప్రాంతమైన కర్ణాటకలోని హంపికి సమీపంలో ఉన్న కిష్కిందలో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యింది శ్రీహనుమత్ జన్మభూమి ట్రస్ట్.  215 మీటర్ల ఎత్తులో ఈ విగ్రహం ఉండబోతున్నది.  విగ్రహం చుట్టూ నాలుగు వైపులా నాలుగు ప్రాకారాలు ఉంటాయి.  ఇక గోడలపై రామాయణానికి సంబంధించిన బొమ్మలు ఉంటాయని శ్రీహనుమత్ జన్మభూమి ట్రస్ట్ పేర్కొన్నది. అయోధ్యతో పాటు కిష్కిందను డెవలప్ చేస్తామని, కిష్కిందలో ఏర్పాటు చేయబోతున్న హనుమంతుడి విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ డివోషన్ గా పిలుస్తామని శ్రీహనుమత్ జన్మభూమి ట్రస్ట్ పేర్కొన్నది.