'కిసాన్ సమ్మాన్' ప్రారంభం.. తొలి విడత రూ.2వేలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. తొలి విడతలో ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక సహా 14 రాష్ర్టాల రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ. 6 వేలు నగదు జమ చేయనున్నారు. తొలి విడతగా ఇప్పుడు కోటి మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు జమ చేస్తున్న కేంద్రం.. మిగతా రూ. 4 వేలు మరో రెండు విడతల్లో బదిలీ చేయనుంది.
ఈ పథకం కింద 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికి ఏటా రూ.6 వేలు పెట్టబడి సాయంగా ఇవ్వనున్నారు. మొత్తం 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కేంద్ర బడ్జెట్లో రూ.75 వేల కోట్లు కేటాయించారు. తెలంగాణలో 21 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)