కరోనా టీకా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ...

కరోనా టీకా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ...

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా ముందుకు సాగుతున్నది.  తొలివిడతలో ఆరోగ్య కార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ అందించారు. తొలి విడత సక్సెస్‌ కావడంతో.... ఇవాళ్టి నుంచి రెండో విడత వ్యాక్సిన్ ను పంపిణీ చేయబోతున్నారు.  ఇది ఇలా ఉండగా.. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు. "ఎయిమ్స్‌లో కరోనా టీకా ఫస్ట్‌ డోసు తీసుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి మరువలేనిది. అర్హత ఉన్న వాళ్లందరూ టీకా వేసుకోవాలి" అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.