యుద్దానికి సిద్దమౌతున్న చైనా... తప్పును కప్పిపుచ్చుకోవడానికేనా లేక...!!

యుద్దానికి సిద్దమౌతున్న చైనా... తప్పును కప్పిపుచ్చుకోవడానికేనా లేక...!!

ఇప్పటి వరకు ఇండియాకు పాకిస్తాన్ తో మాత్రమే ముప్పు ఉండేది.  నిత్యం బోర్డర్ లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో పాటుగా, ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడే విధంగా చేస్తూ కాశ్మీర్ లో అలజడులు సృష్టిస్తూ ఉండేది.  ఇప్పుడు ఈ లిస్ట్ లో చైనా కూడా చేరిపోయింది. లడక్, సిక్కిం బోర్డర్ లో చైనా ఆర్మీ మోహరించింది.  కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.  

పదుల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీగా తలపడ్డారు.  గాయాలపాలయ్యారు.  దీంతో లడక్ బోర్డర్ ఉద్రిక్తకరంగా మారింది.  ఇండియన్ ఆర్మీ అధినేత నరవాణే ఇటీవలే లడక్ కు వెళ్లి అక్కడ పరిస్థితులు సమీక్షించారు.  నరవాణే లడక్ పర్యటన రహస్యంగా ఉండటంతో అనేక అనుమానాలకు తావునిస్తున్నాయి.  మరోవైపు చైనా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆర్మీని మోహరిస్తోంది.  పైగా నిన్నటి రోజున చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు.  యుద్దానికి సిద్ధంగా ఉండేలా సైన్యాన్ని రెడీ చేయాలనీ పిలుపునిచ్చారు.  దీనికంటే ముందు ఇండియా ప్రధాని మోడీ అత్యవసరంగా హైలెవల్ మీటింగ్ జరపడం కూడా అనేక అనుమానాలకు తావునిస్తోంది.  జరుగుతున్నా తాజా పరిణామాలను విశ్లేషిస్తే ఇండియా, చైనా దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది.  చైనాపై ప్రపంచం చేస్తున్న కరోనా ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఈ పని చేస్తుందా అన్నది సందేహంగా మారింది.