కేజీఎఫ్ దర్శకుడు తరువాతి సినిమా ఎవరితో..

కేజీఎఫ్ దర్శకుడు తరువాతి సినిమా ఎవరితో..

ప్రశాంత్ నీల్ ఈ డైరెక్టర్ తన ఒక్క సినిమాతో దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాది నుంచి వచ్చి మెప్పించిన పాన్ ఇండియా సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. హీరోని చూపడంలో.. అతడి ఎలివేషన్ చిత్రీకరించడంలో నీల్‌కు సాటిలేరని నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం నీల్ కేజీఎఫ్2 చిత్రీకరణలో బాగా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ తెలుగు హీరోలతో చేయనున్నాడు. లేదా తెలుగు హీరోలే అతనితో చేసేందుకు మొగ్గు చూపుతున్నారా. ఇప్పటికే ప్రశాంత్ మైత్రి మేకర్స్‌తో ఓ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో ప్రశాంత్ ఓ సినిమా తీయనున్నాడని వార్తలు వస్తున్నాయి. తారక్ ఇప్పటికే ఓ మంచి సినిమా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్‌టీఆర్ ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా తీయనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రశాంత్‌తో సినిమా చేస్తాడనీ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌తోనూ ప్రశాంత్ ఓ కథను చర్చించాడని టాక్ ఉంది. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్‌లో చేస్తున్నాడు. ఆతరువాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేసేందుకు  సిద్దమవుతున్నాడు. మరి ప్రశాంత్ తన తరువాతి సినిమాను ఎవరితో చేస్తాడనేది ఒక మిస్టరీగా మారింది. దీనిపై కేజీఎఫ్2 రిలీజ్ తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.