ఈ సారైనా ప్రణీత సక్సెస్ అవుతుందా..

ఈ సారైనా ప్రణీత సక్సెస్ అవుతుందా..

తెలుగులో హీరోయిన్‌గా రాణించలేక పోయిన హీరోయిన్లలో ప్రణీత కూడా ఒకరు. పలు తెలుగు సినిమాల్లో చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన రీతిలో అవకాశాలు రాలేదు. ప్రముఖ హీరోల పక్కన చేసిన్నప్పటికీ ఎటువంటి మార్పూ లేదు. ఎన్‌టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన కూడా చేసింది. ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు లేకపోయినా ఇతర భాషల్లో మాత్రం అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్తించినా రెండు సంత్సారాలుగా ఎటువంటి అవకాశాలు రాలేదు. ఎట్టకేలకు ఈ భామకు టాలీవుడ్‌లో సక్సెస్ అయ్యేందుకు మరో అవకాశం వచ్చిందని సమాచారం. ఆ చాన్స్ కూడా మాస్ మహారాజ్ సరసన చేసేందుకు వచ్చిందట. మరి కొన్నాళ్లలో షూటింగ్‌ను మొదలు చేయనున్న ఈ సినిమాలోకి మరో హీరోయిన్‌ను కూడా ఎంపిక చేయనున్నారిన వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపోందనుంది. మరి ఈ అవకాశంతోనైనా ప్రణీత టాలీవుడ్‌లో సక్సెస్ అవుతుందా అనేది చూడాలి.