ప్రణయ్ పిరికివాడు కాదు..

ప్రణయ్ పిరికివాడు కాదు..

అనంతపూర్‌లో జరిగిన ప్రణయ్ ఆత్మహత్య కేసు ప్రస్తుతం రాష్ట్రమంతా హల్‌చల్ చేస్తోంది. కొందరు అది హత్యని, మరి కొందరు ఆత్మహత్యని అంటున్నారు. అయితే బాధితుడు ప్రణయ్ తల్లి దండ్రుల మాత్రం వారి కుమారుడు అంత పిరికివాడు వాడని, ప్రేమ అంటూ మోసం చేశారని తెలిపారు. అంతేకాకుండా అఖిల తల్లిదండ్రులు కూడా మోసం చేశారన్నారు. ఇలాంటి మోసగాళ్ళు సమాజంలో ఉండకూడదని, వీరి వల్లే ఎన్నో అమాయకపు ప్రాణాలు బలవుతున్నాయిన అన్నారు. అయితే చనిపోయిన ప్రణయ్ ధర్వవరం మాజీ ఎమ్మేల్యే జయమ్మ మనువడని సమాచారం. ఈ విషయం తెలియడంతో జయమ్మ కుటుంభం శోకసంద్రంలో మునిగిపోయారు. అతడి తల్లిదండ్రులు పుచ్చకాయల నారాయణ స్వామి, వాణీలు పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్నారు.