హిట్ కొట్టడానికి 15 ఏళ్ళు కష్టపడ్డాడు..!!

హిట్ కొట్టడానికి 15 ఏళ్ళు కష్టపడ్డాడు..!!

సినిమాలో వారసులు ఎంతోమంది వస్తుంటారు.  అందరు నిలబడతారు అనే గ్యారెంటీ లేదు.  వారసులుగా వచ్చిన కొందరు మొదటిసినిమాకే నిలబడొచ్చు.  ఇంకొందరికి కొన్ని సినిమాల సమయం పడుతుంది.  అది హీరోలు కావొచ్చు... టెక్నిషియన్లు కావొచ్చు.  రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా 2004లో నీతో అనే సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 

ఆ తరువాత బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలు చేశారు.  ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.  అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మంచి కథ సంవత్సరాల తరబడి కూర్చొని జడ్జిమెంటల్ హై క్యా కథను సిద్ధం చేసుకున్నాడు.  కంగనా రనౌత్ అయితేనే కథకు న్యాయం చేయగలదని చెప్పి ఆమెను ఎంచుకున్నాడు. ఫలితం సూపర్ హిట్.  2004లో సినిమా ఇండస్ట్రీకి వస్తే.. 2019 లో హిట్ వచ్చింది. ఒక్క హిట్ కోసం దాదాపు 15 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది.