కంగనా విసిగించలేదంటున్న దర్శకుడు !

కంగనా విసిగించలేదంటున్న దర్శకుడు !

 కంగనా రనౌత్ ప్రస్తుతం 'మెంటల్ హై క్యా' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు.  షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తయ్యాక ఔట్ ఫుట్ చూసిన కంగనా కొంత రీషూట్ చేయాలని పట్టుబట్టిందట.  కానీ ప్రకాష్ అందుకు ఒప్పుకోలేదట.  దీంతో ఇద్దరి నడుమ వివాదం నడుస్తునట్టు వార్తలొచ్చాయి.  

తాజాగా వీటిపై స్పందించిన ప్రకాష్ కంగనాతో ఎలాంటి గొడవ లేదని, షూటింగ్ సజావుగానే సాగుతోందని, నిజానికి కంగనాతో పనిచేయడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చారు.  దీంతో వివాదానికి తెరపడింది.  ఇకపోతే గతంలో 'మణికర్ణిక' సినిమా విషయంలో కంగనాకు, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెద్ద వివాదం నడిచిన సంగతి తేలిందే.