ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తుతున్న వరద

ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తుతున్న వరద


ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్‌ఫ్లో 20173 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ ఫ్లో.. 20404 క్యూసెక్కులు ఉంది. బందరు, ఏలూరు, రైవస్‌ కాల్వలకు 11704 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ ఏడు గేట్లు ద్వారా 8700 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి ఇరిగేషన్‌ అధికారులు వదులుతున్నారు. ఇక ప్రకాశం బ్యారెజ్‌ ప్రస్తుత నీటి మట్టం 3.07 టీఎంసీలకు చేరింది. మున్నేరు నుంచి మరింత వరద వచ్చే సూచనలున్నాని అధికారులు చెబుతున్నారు. మున్నేరు నుంచి వచ్చే వరద నీటికి అనుగుణంగా నీటిని కిందకు వదిలేందుకు ఇరిగేషన్‌ శాఖ ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసిన అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.