పోలీస్‌గా ప్రగ్యా జైస్వాల్.. ఎందులోనో తెలుసా..

పోలీస్‌గా ప్రగ్యా జైస్వాల్.. ఎందులోనో తెలుసా..

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ప్రగ్యా కంచె సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు. తన తొలి సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రగ్యా ఆ తరువాత ఆశించిన స్థాయిలో హిట్‌లు అందుకోలేదు. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా ప్రగ్యాకు మరో అవకావం అందింది. యాక్షన్ కాంగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రగా తెరకెక్కతున్న సన్ ఆఫ్ ఇండియా సినిమాలో అమ్మడు అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాను డైమెండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా ఓ పోలీస్ అధికారి పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్‌ను ఓకే చేశారంట. అయితే ప్రగ్యాకు పోలీస్ పాత్ర చేయడం ఇదేం మొదటి సారి కాదు. ఇదివరకే నక్షత్రం సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రగ్యా కనిపించారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో ప్రగ్యా జైస్వాల్ పాల్గొన్నారు. అమ్మడు ప్రస్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీలోనూ ఓ సినిమా అవకాశం అందుకున్నారు. బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ చేయనున్న అంతిమ్ సినిమాలో నటించనున్నారు.