ఆర్ఆర్ఆర్‌ను మించిన భారీ బడ్జెట్‌తో ప్రభాస్ సినిమా..?

ఆర్ఆర్ఆర్‌ను మించిన భారీ బడ్జెట్‌తో ప్రభాస్ సినిమా..?

బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా కనుమరుగవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతి సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక్కటి వస్తే గొప్ప. సరైన కథ కుదరకనో, హీరోల మధ్య విభేధాల కారణంగానో తెలియదు కానీ మల్టీస్టారర్ సినిమాలు రావడం మాత్రం తగ్గిపోయింది. అయితే మన ఇండస్ట్రీలో మాత్రం మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం మొదలైంది. ఇద్దరు స్టార్ హీరోలతో భారీ సినిమా తెరకెక్కించేందుకు ఇక్కడి హీరోలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో కూడా ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అందులో భాగంగా ప్రభాస్‌తో బాలీవుడ్ అగ్రదర్శకుడు నెవర్ బిఫోర్ అనేలా ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. బాలవుడ్‌లో చాలా కాలం తరువాత ‘వార్’ సినిమా ఓ మాదిరి మల్టీస్టారర్‌గా మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు వార్ దర్శకుడు హృతిక్‌తో మరో భారీ యాక్షన్ సినిమాను చేయాలని చూస్తున్నారంట. మళ్లీ ఈ సినిమాలోకి టైగర్‌ను తీసుకుంటారో లేదో తెలీదు కాని మరో స్టార్ హీరోను మాత్రం పక్కా అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హృతిక్‌తో తలపడేందుకు ప్రభాస్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని, వీరిద్దరి మధ్య భారీ ఫైట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ వారు ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమాను మించిన భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు సిద్దమవుతున్నారంట. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను దాదాపు రూ.450 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు యశ్ రాజ్ ఫిలింస్ వారు చేయనున్న మల్టీస్టారర్ సినిమాను దాదాపు రూ.500 కోట్లతో చేసేందకు రెడీ అంటున్నారంట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.