'ఆదిపురుష్' ట్రెండ్ అవుతున్న.. కనిపించని అప్డేట్

'ఆదిపురుష్' ట్రెండ్ అవుతున్న.. కనిపించని అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రల్లో నటిస్తున్నారు.. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా, రామాయణం నేపథ్యంగా తీస్తున్న ఈ సినిమా నుంచి శ్రీరామనవమి కానుకగా అప్​డేట్ రానుందని నిన్నటి నుంచి #Adipurush హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ వస్తోంది. బుధవారం ఉదయం ఆదిపురుష్ అప్డేట్ రాబోతుందని వార్తలు చక్కర్లు కొట్టగా.. అది​ కేవలం పుకారు మాత్రమేనని తెలుస్తోంది. మరి సాయంత్రం వరకు ఏమైనా సర్ ప్రైజ్ ఉంటుందేమో చూడాలి.