రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి ప్రభాస్ విరాళం...

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి ప్రభాస్ విరాళం...

చైనా నుండి వచ్చిన కరోనా కారణంగా భారత్ సతమతమవుతుంది. అయితే ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మన దగ్గర ఐపీఎల్ సహా అని కార్యక్రమాలు నిలిచిపోయాయి. అలాగే సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. అయితే కరోనా బాధితులకు సహాయం చేయడానికి సినీ సెలబ్రెటీలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకు వచ్చారు. ప్రభాస్ కరోనా బాధితుల సహాయం కొరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి మొత్తం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే ప్రజలు అందరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని తెలిపారు. అదే విధంగా మరో హీరో సాయి ధరమ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి 10 లక్షల విరాళం ప్రకటించారు.