పవన్ అభిమానులకు ఈ ఏడాది డబుల్ ధమాకా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వకీల్‌సాబ్ పూర్తి చేసుకున్న పవన్ తాజాగా మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌లో చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పవన్ తన అభిమానులకు డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌గా రూపొందిన వకీల్‌సాబ్ ఏప్రిల్9న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ తెరకెక్కిస్తున్న అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌ను కూడా మేకర్స్ ఈ ఏడాదికే విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం తెలుగు హీరోలందరూ తమ సినిమాల రిలీజ్ డేట్లను పోటాపోటీగా ప్రకటిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సెప్టంబర్ నెలలో ఏ సిినిమా విడుదలను ప్రకటించలేదు. ఈ అవకాశాన్ని వృధా కాకుండా త్వరగా సెప్టెంబర్ నెల థియేటర్ స్లాట్స్ బర్తీ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్, రానాలతో తెరకెక్కిస్తున్న సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్10న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందుకోసం సినిమా చిత్రీకరణను కూడా వేగవంతం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను అందిస్తున్నారు. మరి ఈ ఏడాది పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)