'భాగ్ సాలే' అంటున్న కీరవాణి కుమారుడు సింహా

'భాగ్ సాలే' అంటున్న కీరవాణి కుమారుడు సింహా

'యమదొంగ', 'మర్యాద రామన్న' చిత్రాలలో బాలనటుడిగా సత్తా చాటిన కీరవాణి కుమారుడు శ్రీ సింహా 'మత్తువదలరా'తో హీరోగా పరిచయం అయి తొలి సినిమాతోనే సత్తా చాటాడు. సోమవారం శ్రీ సింహా పుట్టినరోజు. ఈ సందర్భంగా తను హీరోగా నిర్మాణంలో ఉన్న రెండు చిత్రాల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులో ఒకటి సాయి కొర్రపాటి నిర్మిస్తున్న 'తెల్లవారితే గురువారం' కాగా మరోటి 'భాగ్ సాలే'. ప్రణీత్ బి దర్శకత్వం వహిస్తున్న 'భాగ్ సాలే' సినిమాను మధురా శ్రీధర్, బిగ్ బెన్ యశ్ నిర్మిస్తున్నారు. సురేశ్ బాబు సమర్పణలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ మార్చి మూడో వారంలో ఆరంభించనున్నారు. ఈ సినిమాకు కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.