శ్రీవారికి భారీ విరాళం ప్రకటించిన పోస్కో..

శ్రీవారికి భారీ విరాళం ప్రకటించిన పోస్కో..

తిరుమల దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిది. మన దేశస్థులే కాకుండా.. ఇతర దేశస్థులు శ్రీవారిని దర్శించుకుంటారు. అలాంటి శ్రీవారికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కాస్త తగ్గడంతో భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. అయితే.. తాజాగా పోస్కో సంస్థ శ్రీవారికి భారీ విరాళం ఇచ్చింది. శ్రీవారికి ఎస్వీబీసీ ట్రస్టుకు ఏకంగా రూ. 9 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.