బిగ్ బాస్ కు నో చెప్పిన పూనమ్...

బిగ్ బాస్ కు నో చెప్పిన పూనమ్...

తెలుగులో 'బిగ్ బాస్'  షో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మొదటి  సీజన్ ని  నిర్వహించడంతో బిగ్ బాస్ కు ఆ క్రేజ్ వచ్చింది. తరవాత నాని, నాగార్జున మిగిలిన రెండు సీజన్ లకు హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక తాజాగా బిగ్ బాస్ 4 త్వరలో అంటూ నిర్వాహకులు కూడా ప్రోమో విడుదల చేసారు. ఈ రోజు షోకు సంబందించిన యాడ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రించారు. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కానీ ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియదు. బిగ్ బాస్ 4 లో పాల్గొనేది వీరే అంటూ సోషల్ మీడియాలో రోజుకో పుకారు వస్తుంది. ఇక తాజాగా ఈ షో నిర్వాహకులు టాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్ పూనమ్ కౌర్ ను సంప్రదించారట. అయితే చాలా సినిమాలో హీరోయిన్ గా నటించిన పూనమ్ వాటికంటే కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది. అందువల్ల ఇటువంటి భామ తమ షోలో ఉంటె బాగుంటుంది అనుకున్నారట నిర్వాహకులు. అయితే ఈ ఆఫర్ కు పూనమ్ మాత్రం నో చెప్పినట్లు తెలుస్తుంది.