పూజా భట్ తొలి ముద్దు ముచ్చట

పూజా భట్ తొలి ముద్దు ముచ్చట

మహేశ్ భట్ కూతురు పూజా భట్ తెర మీద తన తొలి ముద్దు గురించి మాట్లాడింది. చాలా ఏళ్ల క్రితం 'సడఖ్‌' సినిమా చేస్తున్నప్పుడు సంజయ్ దత్ ని ముద్దాడాల్సి వచ్చిందట. సంజయ్ ఆమె అభిమాన హీరో. అప్పట్లో పూజా వయస్సు కేవలం 18 ఏళ్లు. ఆ టీనేజ్ లో తన ఫేవరెట్ హీరోని కిస్ చేస్తున్నప్పుడు వల్గర్ గా ఉండకూడదని మహేశ్ భట్ కూతురికి సలహా ఇచ్చాడట. హీరోని పూజా ముద్దాడుతున్నప్పుడు అమాయకత్వం, గాంభీర్యం కలగలిసి కనిపించాలని మహేశ్ చెప్పాడట. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో 'బాంబే బేగమ్స్' అనే షో చేస్తోంది పూజా భట్. ఆ కార్యక్రమం ప్రమోషన్ సందర్భంగా తన తొలి ముద్దు గురించి ముచ్చట్లు చెప్పింది సీనియర్ బ్యూటీ!