బీజేపీ నేతలు గుంటకాడి నక్కళ్ళ వ్యవహరిస్తున్నారు...

బీజేపీ నేతలు గుంటకాడి నక్కళ్ళ వ్యవహరిస్తున్నారు...

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టీఆర్‌ఎస్‌, బీజేపీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు గుంటకాడి నక్కళ్ళ వ్యవహరిస్తున్నారని... అర్ధరాత్రుళ్ళు కాంగ్రెస్ నేతల ఇళ్లలోకి వెళ్లి బీజేపీ నేతలు చేర్చుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో  చేరుకున్నామని గొప్పగా  చెబుతున్న మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , మాజీ కేంద్రమంత్రి సర్వేలను కాంగ్రెస్ వారిని ఎప్పుడో సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ద్రోహి అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు కేసులు పెట్టడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ, తెరాస పార్టీలు డమ్మీ ఫైట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ అరేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ , రాష్ట్రంలో ఉన్న టీఆరెస్ ప్రభుత్వ లు ఏమి చెయ్యలేదని... వరదల పేరుతో టీఆరెస్ నేతలు డబ్బుకు జేబులు నింపుకుంటే అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అది ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే పార్టీలో చర్చించుకుని పరిష్కచుకుందామని.. కాంగ్రెస్ నేతలు బీజేపీ మాయమాటలు నమ్మవద్దని సూచించారు. 2009 ghmc ఎన్నికల కంటే మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఈ సారి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.