దుబాయ్ చేరుకున్న కరేబియన్ కప్ కొట్టిన కెప్టెన్...

దుబాయ్ చేరుకున్న కరేబియన్ కప్ కొట్టిన కెప్టెన్...

ఈ నెల 19న ఐపీఎల్ 2020 యూఏఈ ప్రారంభం కానుండటంతో నెల ముందే అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు అందరూ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం అక్కడికి చేరుకోలేదు. ఎందుకంటే.. అందులో కొంతమంది ఆటగాళ్లు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటే.. ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ లో పోటీపడుతున్నాయి. అయితే ఈ నెల 10న కరేబియన్ లీగ్ ముగియడంతో అందులో ఆడి ఐపీఎల్ లో ఆడాల్సిన ఆటగాళ్ళు అందరూ ఇప్పుడిప్పుడే అక్కడికి చేరుకుంటున్నారు. ముగిసిన ఈ కరేబియన్ లీగ్ లో సెయింట్ లూసియా జూక్స్‌ ను 8 వికెట్ల తేడాతో ఓడించిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నాలుగోసారి టైటిల్‌ను అందుకుంది. కిరాన్ పొలార్డ్ నాయకత్వం వహించిన ఈ జట్టు లీగ్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసారు. అయితే అక్కడ తన జట్టుకి కప్ అందించిన పొలార్డ్ ముంబై ఇండియన్స్ కూడా ఐపీఎల్ టైటిల్ అందించడానికి అబుదాబికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ట్విట్టర్ వేదికగా తెలిపింది. పొలార్డ్ తన మొత్తం కుటుంబంతో వచ్చిన ఫోటోను కూడా షేర్ చేసారు. ఇక ముంబై మొదటి మ్యాచ్ లో చెన్నై తో తలపడనుంది.