తమిళనాడులో పెరుగుతున్న ఎన్నికల వేడి... కొలిక్కొస్తున్న పొత్తులు 

తమిళనాడులో పెరుగుతున్న ఎన్నికల వేడి... కొలిక్కొస్తున్న పొత్తులు 

తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది.  ఇప్పటికే ప్రధాన పార్టీలు పొత్తులపై కసరత్తులు మొదలుపెట్టాయి.  డీఎంకే తన మిత్ర పక్షాలతో పొత్తులు కుదుర్చుకొని పోటీకి సిద్ధం అవుతున్న నేపథ్యంలో అధికారంలో అన్నాడీఎంకే కూడా పొత్తులకు సిద్ధం అయ్యింది.  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మూడోసారి వరసగా అధికారంలో కొనసాగాలని చూస్తున్నది.  బలమైన సామాజిక వర్గాల వారీగా పొత్తులు కుదుర్చుకునేందుకు పార్టీ సిద్ధం అయ్యింది.  అధికార అన్నాడీఎంకే పార్టీ 152 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అన్నా డీఎంకే పార్టీలో పీఎంకే, బీజేపీ, డిఎండికె, టిఎంసి, పుదియ తమిళగం పార్టీలు ఉన్నాయి.  ఇందులో పీఎంకే కు 41, బీజేపీకి 15, డిఎండికె పార్టీకి 18, టిఎంసికి 5, పుదియ తమిళగం పార్టీకి 3 స్థానాలు కేటాయించాలని నిర్ణయించింది అన్నాడీఎంకే.  అయితే, పీఎంకే 50 స్థానాలు కావాలని, బీజేపీ కనీసం 30 స్థానాలు ఇవ్వాలని అడుగుతోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికతకు బలం ఉంటుంది కాబట్టి బలాల ఆధారంగానే పొత్తులు ఉంటాయని అన్నాడీఎంకే స్పష్టం చేసింది.