యూట్యూబ్‌లో చూసి మర్డర్‌.. ఆత్మకు శాంతి కలగాలని డెడ్‌బాడీపై దీపాలు పెట్టి...!

యూట్యూబ్‌లో చూసి మర్డర్‌.. ఆత్మకు శాంతి కలగాలని డెడ్‌బాడీపై దీపాలు పెట్టి...!

నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆర్యనగర్‌లో జరిగిన వివాహిత వరలక్ష్మి మర్డర్ మిస్టరీని చేధించారు పోలీసులు.. ఈ నెల 9వ తేదీన దారుణ హత్యకు గురైంది వరలక్ష్మి.. అతి కిరాతకంగా చంపి.. కాలు వేళ్లను నరికేశారు.. అంతేకాదు.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్న ఉద్దేశంతో ఆమె డెడ్ బాడీ చుట్టు దీపాలు పెట్టడమే కాకుండా ఒంటి పై పసుపు, కుంకుమ చల్లారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టపగలు హత్య జరగడం.. ఇంట్లో ఉన్న కుక్క మొరగక పోవడంతో తెలిసిన వారే హత్య చేసి ఉంటారన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.. వరలక్ష్మి భర్త శ్రీనివాస్ రావు దగ్గర మేస్త్రిగా పని చేస్తున్న నాగరాజు, రాజు ఇద్దరు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

అయితే, హత్యకు సంబంధించి నిందితులు చెప్పిన విషయాలు వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం.. హత్యకు ముందు యూ ట్యూబ్‌లో హార్రర్‌ వీడియోలు చూశామని పోలీసులు విచారణలో నిందితులు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. చంపిన తర్వాత వరలక్ష్మి డెడ్‌బాడీ కాలు వేళ్లను కోసేయడం కూడా దానిలో భాగమే అని తెలిపార. ఇక, మృతురాలి ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశం కూడా వారికి ఉందని చెప్పారట.. చంపిన తర్వాత మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని.. ఆమె డెడ్ బాడీ చుట్టూ దీపాలు పెట్టి.. ఆపై ఆమె ఒంటిపై పసుపు, కుంకుమ చల్లినట్టు నిందితులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. ఇది పక్కా ప్లాన్‌ మర్డర్‌గా తేల్చారు పోలీసులు. ఏదేమైనా ఈ తరహా మర్డర్‌ అందరినీ భయపెడుతోంది.