నకిలీ యూనివర్సిటీ డాక్టరేట్‌ పట్టాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు...

నకిలీ యూనివర్సిటీ డాక్టరేట్‌ పట్టాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు...

కర్ణాటకా, మైసూర్ లో నకిలీ యూనివర్సిటీ డాక్టరేట్‌ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదో పెద్ద హోటల్‌. సమావేశ గదిలో కోలాహలం. కొందరు స్నాతకోత్సవ గౌన్లు ధరించి.. డాక్టరేట్లు అందుకోబోతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇంతలో పోలీసులొచ్చారు. ముగ్గురిని అరెస్ట్‌చేశారు. అక్కడి నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే... తమిళనాడుకు చెందిన కొందరు ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ అనే నకిలీ వర్సిటీ పేరుతో దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మైసూర్‌లో ఓ హోటల్‌పై దాడిచేశారు. ఔత్సాహికుల నుంచి భారీగా డబ్బు తీసుకుని నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు నంబియార్, శ్రీనివాస్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆ సమయంలో హోటల్‌లో సుమారు 142 మందికి గౌరవ డాక్టరేట్‌ పట్టాలిస్తున్నారు.