మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద కలకలం..నలుగురిని గుర్తించిన పోలీసులు.!

    మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద కలకలం..నలుగురిని గుర్తించిన పోలీసులు.!

సినీ నటుడు మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద నలుగురు దుండగులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఇంటి వద్ద పనిచేసే వాచ్ మెన్ భయటికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి ఏపీ 31 ఏఎన్‌ 0004 నంబర్ గల ఇన్నోవా కారు దూసుకు వెళ్ళింది. వాచ్ మెన్ వెంటనే సమాచారం ఇవ్వడం తో మోహన్‌బాబు కుటుంబీకులు భయటకు వచ్చారు. కాగా దుండగులు మిమ్మల్ని వదలమంటూ హెచ్చరించి వెళ్లారు. దీంతో భయానికి లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు వార్ణింగ్ ఇచ్చిన నలుగురు యువకులను గుర్తించారు. మైలార్దేవ్పల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించిన పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు ఎందుకు వచ్చారు అనే దానిపై విచారణ జరుపుతున్నారు.