హాస్టల్ విధ్యార్దులకి ఊరట...సొంత ఊళ్లు వెళ్లేందుకు పర్మిషన్ ?

  హాస్టల్ విధ్యార్దులకి ఊరట...సొంత ఊళ్లు వెళ్లేందుకు పర్మిషన్ ?

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట సహా అన్ని ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకుల అవస్థలు చూసి పోలీసులు దిగొచ్చారు. వారు ఎటువంటి ఆటంకం లేకుండా స్వగ్రామాలకు వెళ్లేందుకు ఎన్ఓసీలు జారీ చేశారు. మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లోని హాస్టళ్ల యజమానులు యువతీయువకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కూకట్ పల్లిలో అయితే ఏకంగా కిలోమీటర్ల మేర విద్యార్ధులు లైన్ లో నిలుచోవలసి వచ్చింది. అయితే బస్సులు, రైళ్లు అన్నీ బంద్ ఉంటే ఇప్పుడు ఎక్కడికి వెళతారనేది తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద హైదరాబాద్ నుంచి భారీగా వచ్చిన కార్లు, బైక్‌లు, ఆంధ్రలోకి పోలీసులు అనుమతించడం లేదు. మరిప్పుడు ఏపీ వెళ్ళే వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది.