ఎన్నికల స్పెషల్ : భాగ్యనగరంలో కొత్త డ్రగ్

ఎన్నికల స్పెషల్ : భాగ్యనగరంలో కొత్త డ్రగ్

గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా కొనసాగుతున్న పోలీసుల తనిఖీల్లో.. కొత్తరకం డ్రగ్‌ పట్టుబడింది. మత్తు కోసం వినియోగించే హాషిష్ ఆయిల్ ను తరలిస్తుండగా.. ఒక డ్రగ్ డీలర్‌ను పట్టుకున్నారు పోలీసులు. ఒక లీటర్ హషిష్‌ ఆయిల్‌ను లక్ష రూపాయలకు వైజాగ్ ఏజెన్సీ నుండి కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తుండగా.. నిందితుణ్ని పట్టుకున్నారు. మణికొండకు చెందిన లక్ష్మీపతి ఈ బ్లాక్‌ దందా చేస్తున్నట్టు గుర్తించారు.  హాషిష్ ఆయిల్ లో ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ ను కలుపుతున్నాడు లక్ష్మీపతి. చిన్న చిన్న ప్యాకెట్లుగా మూడు వేలకు ఒకటి చొప్పున విక్రయిస్తున్నాడు. సిగిరెట్ తాగేటప్పుడు హాషిష్ ఆయిల్ రెండు చుక్కలు వేసుకుంటే విపరీతమైన నిషా వస్తుంది. దీంతో, చాలామంది దీన్ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. హయత్ నగర్ పెద్ద అంబర్ పేట్ దగ్గర వాహనాల తనిఖీల్లో లక్ష్మీపతిని పట్టుకున్నారు పోలీసులు.