ఫలక్నామలో ఐపీఎల్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఫలక్నామలో ఐపీఎల్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఐపీఎల్ 2020 ప్రారంభం అభిమానులతో పాటుగా బెట్టింగ్ రాయుళ్లకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ నుండే బెట్టింగ్ ప్రారంభించేసారు. కేవలం మ్యాచ్ విజేతలు ఎవరు అనేది మాత్రమే కాకుండా టాస్ ఎవరు గెలుస్తారు, ఏ బాట్స్మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు అనే దానితో పాటుగా బాల్ బాల్ కు బెట్టింగ్ వేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సౌత్ జోన్ ఫలక్నామలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అలీ నగర్ లోని ఫేమస్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఇద్దరు నిందితులు. సయ్యద్ సత్తార్, మొహమ్మద్ హాసన్ అనే ఇద్దరు నిందితుల నుండి 40వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరినీ విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.