సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త !

సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త !

సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఊరు వెళ్లే వారు స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వండని ఆయన కోరారు. అలానే ఇంట్లో విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి వెళ్లకూడదన్న ఆయన ప్రతి ఒక్కరు సీసీటీవీ కెమెరాలు, వాచ్ మెన్ లను ఉండే విధంగా చూడాలని అన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్న ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ప్రయాణాలు చేయాలని అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. అలానే పండుగ తర్వాత హైదరాబాద్ కు వచ్చే వారికి ఏలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.