28 ఏళ్ల క్రితం చెప్పిన ఆ మాటకు కట్టుబడిన మోడీ... 

28 ఏళ్ల క్రితం చెప్పిన ఆ మాటకు కట్టుబడిన మోడీ... 

ఈనెల 5 వ తేదీన అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి భూమిపూజ జరగబోతున్న సంగతి తెలిసిందే.  ఈ పూజకు ప్రధాని మోడీ హాజరుకాబోతున్నారు.  మోడీ అయోధ్యకు రావడం ఇది రెండోసారి.  సరిగ్గా 28 ఏళ్ళక్రితం 1992 లో మోడీ జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేయాలని కోరుతూ కన్యాకుమారి నుంచి తిరంగా యాత్రను ప్రారంభించి అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ జనవరి 18 వ తేదీన ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు.  

ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ.  ఈ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఆ మరుసటి రోజున అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషితో కలిసి అయోధ్య వెళ్లి, అక్కడ స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించారు.  అయోధ్యలో రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం జరిగే రోజున తిరిగి అయోధ్యలో అడుగుపెడతానని, అప్పటి వరకు అయోధ్యలో అడుగుపెట్టనని చెప్పారు.  28 ఏళ్ల తరువాత ఆ కల నెరవేరబోతున్నది.  అయోధ్య రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజను చేయబోతున్నారు.  ఈ విధంగా మోడీ రెండోసారి అయోధ్యకు వస్తున్నారు.